SRPT: తాము చదువుకున్న పాఠశాలకు పూర్వ విద్యార్థులు కంప్యూటర్ బహుకరించారు. నడిగూడెం మండల కేంద్రంలోని శ్రీ కొల్లు పాపయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2004 – 2005 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ మేరకు 35 వేల రూపాయల విలువగల కంప్యూటర్ను పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవికి ఇవాళ అందజేశారు.