HYD: దీపావళి సందర్భంగా ఇళ్లు శుభ్రం చేసేటప్పుడు, పాత వస్తువులను చెత్తలో పారేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. మీరు వద్దనుకునే పనికొచ్చే వస్తువులు, దుస్తులు ఎంతోమంది నిరుపేదలకు ఉపయోగపడతాయి. వీటిని స్వీకరించడానికి నగరంలో చాలా ఎన్జీవోలు, ఆశ్రమాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని దానం చేసి, మీ పండుగ వెలుగులను మరికొంతమంది జీవితాల్లో నింపండి.