MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన రహదారి విస్తరణ కోసం బుధవారం అధికారులు సర్వే చేపట్టారు. మెదక్ చౌరస్తా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు 40 ఫీట్ల రహదారి విస్తరణ కోసం సెంటర్ పాయింట్ ఫిక్స్ చేసి సర్వే నిర్వహిస్తున్నారు. ఎంతోకాలంగా ప్రజల ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే రోహిత్ రావు విస్తరణ పనులకు రెండు కోట్లు కేటాయించినట్లు తెలిపారు.