HNK: జిల్లా కేంద్రంలోని KU పరిధిలో డిగ్రీ నాన్ ప్రొఫెషనల్ కోర్సులకు 2024-25 ఫీజులనే 2025-26కి కొనసాగుతాయని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం స్పష్టం చేశారు. కామన్ సర్వీస్, పరీక్షల ఫీజులు అలాగే కొనసాగుతాయని తెలిపారు. ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల కళాశాలల ప్రిన్సిపల్స్ విద్యార్థులకు ఫీజుల విషయం తెలియజేయాలని, ఆందోళన అవసరం లేదని సూచించారు.