MHBD: కురవి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బాదావత్ లక్ష్మీ- రాజునాయక్ లను జిల్లా ఎస్పీ డా.శబరీష్ సత్కరించారు. మండల కేంద్రంలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా సర్పంచ్ దంపతులు శబరీష్ని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఎస్పీకి వివరించారు. ఈ క్రమంలో ఆయన వారిని శాలువా కప్పి అభినందించారు.