SRCL: బోయినపల్లి మండలం కొదురుపాక మిడ్ మానేరు రిజర్వాయర్ నీటిమట్టం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. శనివారం ఉదయం 6 గంటల నాటికి నీటి మట్టం 318 మీటర్ల పూర్తి స్థాయి సామర్థ్యానికి గాను 309.56 మీటర్ల వద్ద నమోదైంది. రిజర్వాయర్ మొత్తం సామర్థ్యం 27.55 టీఎంసీలకు గాను ప్రస్తుతం 10.71 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. ప్రస్తుతం రిజర్వాయర్‌కు ఎటువంటి ఇన్‌ఫ్లో లేదు.