HYD: సైబర్ క్రైమ్‌పై విద్యార్థులకు అవగాహన ఉండాలని సికింద్రాబాద్ నార్త్ జోన్ DCP రష్మి పెరుమాళ్ అన్నారు. బుధవారం గోపాలపురం PS ఆధ్వర్యంలో ఓ ప్రైవేట్ స్కూల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో మాట్లాడారు. సైబర్ క్రైమ్, వ్యక్తిత్వ వికాసం పై విద్యార్థులకు అవగాహన కల్పించారు.