»A Case Of Cheating Has Been Registered On Bookmyshow What Is The Reason
BookMyShowపై చీటింగ్ కేసు నమోదు.. కారణమేటంటే?
న్యూఇయర్ వస్తుందంటే చాలామంది వేడుకల కోసం ముందే ప్లాన్ చేసుకుంటారు. వేడుకలను అనుమతి తీసుకోవాలని పోలీసులు తెలిపారు. అయితే సన్‌బర్న్ పేరుతో ఎక్కువగా ఈవెంట్లు జరుగుతుంటాయి. పోలీసుల దగ్గర ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండానే ఆన్లైన్లో టికెట్లు విడుదల చేయడంతో బుక్‌మైషో మీద చీటింగ్ కేసు నమోదు చేశారు.
BookMyShow: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సన్‌బర్న్ పేరుతో ఈవెంట్లు జరుగుతాయి. దేశవ్యాప్తంగా ఇవి నగరాల్లో జరుగుతుంటాయి. సన్‌బర్న్ ఈవెంట్లు ఎక్కడ జరిగిన వివాదాలు తప్పవు. అయితే ఈ ఏడాది హైదరాబాద్‌లో సన్‌బర్న్ వేడుకలు మాదాపూర్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవెంట్‌కు సైబరాబాద్ పోలీసులు అనుమతి ఇవ్వకుండా ఆన్లైన్లో టికెట్లు విక్రయించడంతో ప్రస్తుతం దీని గురించి చర్చ జరుగుతోంది. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవెంట్‌కు అనుమతి ఎవరిచ్చారని, ఆన్లైన్లో బుకింగ్‌లు ఎలా ప్రారంభించారని నిన్న జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రి పోలీసులను ప్రశ్నించారు.
ఈ విషయంపై మాదాపూర్ పోలీసులు బుక్‌మై షోపై చీటింగ్ కేసు నమోదు చేశారు. అనుమతి ఇవ్వకున్నా ఆన్లైన్లో టికెట్లు విక్రయించడంపై బుక్‌మై షోతో పాటు సన్‌బర్న్ షో నిర్వాహకులపైన కూడా కేసులు నమోదు చేశారు. న్యూఇయర్ ఈవెంట్ల కోసం తమ దగ్గర అనుమతి తీసుకోవాల్సిందేనని పోలీసులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. అలాగే ఈవెంట్లలో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తే క్రిమినల్ కేసులు కూడా తప్పవన్నారు.