BHNG: మున్సిపాలిటీల్లో ప్రజల దాహార్తి తీర్చాలనే ఉద్దేశంతో తీసుకువచ్చిన ‘అమృత్ 2.0’ పథకం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. పట్టణాల్లో వీటి పనులు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్లు ఉన్నాయని స్థానికులు తెలిపారు. మార్చి నాటికే అందుబాటులోకి రావల్సి ఉండగా, పలు చోట్ల ఇంకా 50 శాతం పనులు కూడా పూర్తికాలేదని పేర్కొన్నారు.