ADB: జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులు గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. మైనార్టీ సీనియర్ నాయకులు సాజితోద్దీన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలపై విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. అభివృద్ధి పేరిట ఫ్లెక్సీల ఏర్పాటులో ఉన్న శ్రద్ధ ప్రజల సంక్షేమంపై లేదని ఎద్దేవా చేశారు.