అనంతపురం జిల్లాలో విద్యుత్ వినియోగదారుల సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు ప్రతి సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు ‘డైలీ యు విత్ ఎస్ఈ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ శేషాద్రిశేఖర్ తెలిపారు. సమస్యలు ఉన్న వారు 08554-272943 లేదా 9154790350 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.