NLG: కనగల్ కేజీబీవీలో ఖాళీగా ఉన్న హెడ్ కుక్ పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంపీడీవో వేద రక్షిత తెలిపారు. ఆసక్తి గల మహిళా అభ్యర్థులు ఈ నెల 26వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పదో తరగతి ఉత్తీర్ణులై, 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. అర్హత గల వారు తమ ధ్రువపత్రాలతో సకాలంలో దరఖాస్తు అందజేయాలని కోరారు.