RR: గ్రామపంచాయతీ, సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేలా అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి RDOలు, MPDOలు, MPOలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థులు నియమ నిబంధనలపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలన్నారు.