NZB: రాబోయే గోదావరి పుష్కరాలు-2027ను దృష్టిలో ఉంచుకుని NZB పరిధిలోని గోదావరి నది తీర ప్రాంతాల్లో ఉన్న ఘాట్ల వద్ద సమగ్ర ఏర్పాట్లు చేపట్టాలని ఎంపీ అర్వింద్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి శుక్రవారం లేఖ రాశారు. జిల్లాల్లో గోదావరి తీరం వెంట ఉన్న ఘాట్లకు కోట్లాది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు.