ADB: సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఉందని జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి మాట్లాడారు. రేషన్ కార్డు గల ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత భీమా పథకం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు.