పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు శనివారం ఓదెల మండలం మడక గ్రామంలో 42 ఆర్ కెనాల్ నుంచి పోత్కపల్లి పరిసర ప్రాంతాలకు సాగునీరు అందించడానికి రైతుల సహకారంతో పొలంలో కాల్వ తీసే పనులను ప్రారంభించారు. పోత్కపల్లి గ్రామ ఊర చెరువులోకి సాగునీరు వెళ్ళడానికి ఈ కాల్వ ఉపయోగపడుతుంది. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని, రైతన్నలకు సాగునీరందించడమే తమ లక్ష్యం అన్నారు.