SDPT: నంగునూరు మండలంలో వరి పంటను తెల్లకంకుల సమస్య పీడిస్తోంది. గింజ గట్టిపడే దశలో కంకులు తెల్లగా మారి తాలు అవుతుండటంతో దిగుబడి తగ్గుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రసాయన మందులు వాడినా ఫలితం లేదని, పెట్టుబడి నష్టపోతున్నామని వాపోతున్నారు. వ్యవసాయ అధికారులు వెంటనే స్పందించి, పొలాలను పరిశీలించి తగిన సూచనలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.