SRD: మిషన్ భగీరథ పైప్ లైన్లో మరమ్మత్తుల కారణంగా ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు సంగారెడ్డి మున్సిపాలిటీలో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సోమవారం ప్రకటనలో తెలిపారు. ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నాయంగా నీటిని సరఫరా చేస్తామని చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.