RR: శంషాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరేందుకు సిద్ధమైన స్పైస్ జెట్ విమానం రద్దు చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఆదివారం సాయంత్రం తిరుపతి బయలుదేరేందుకు విమానం సిద్ధమైంది. విమానంలో ప్రయాణికులు ఎక్కి కూర్చున్న తర్వాత టేక్ ఆఫ్ తీసుకునే సమయంలో విమానం మొరాయించడంతో పైలట్ ప్రయాణికులను దింపి వేశారు. అనంతరం విమానాన్ని రద్దు చేశారు.