ADB: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం చేసినట్లు తాంసి ఎంపీడీఓ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.. శనివారం తాంసి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల డ్రాఫ్ట్ ఓటర్ లిస్టును, పోలింగ్ స్టేషన్ జాబితాను ప్రచురితం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. ఓటర్ లిస్ట్‌లో ఏవైన సందేహాలు ఉంటే తెలియజేయాలని సూచించారు.