NRPT: నారాయణపేట పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన బోయ అనిల్ కుమార్ (20) శనివారం రాత్రి చెట్టుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గొర్రెల కాపరిగా పనిచేస్తున్న అనిల్‌ను తల్లి మందలించడంతో మనస్తాపం చెంది ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు సమాచారం. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.