WGL: ఉమ్మడి జిల్లాల్లో నామినేషన్ తొలిరోజే స్థానిక ఎన్నికలు వాయిదా పడటం అనూహ్య పరిణామంగా మారింది. అఫిడవిట్లు, నామపత్రాలు సిద్ధం చేసుకుని ముహూర్తాలు చూసుకున్న నేతలు హైకోర్టు స్టే ఆర్డర్‌తో ఉసూరుమన్నారు. కోడ్ ఎత్తేయడంతో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో అందరి చూపు అటువైపుకు మళ్లింది.