NZB: కమ్మర్ పల్లి ఉపాధి హామీ పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్ అన్నారు. శనివారం మండలంలోని రాజరాజేశ్వరి నగర్లో కొనసాగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. కూలీల హాజరు రిజిస్టర్ను పరిశీలించి, కూలీల హాజరు తీసుకున్నారు.