WGL: మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిసి సాధారణ జీవితం గడపాలని వరంగల్ సీపీ సన్రైత్ సింగ్ పిలుపునిచ్చారు. సోమవారం వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో ఫిబ్రవరి 21న వరంగల్ సీపీ ఎదుట లొంగిపోయిన నిషేధిత మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యురాలు కేశే అలియాస్ జెన్నీకి ఆమెపై ప్రభుత్వం ప్రకటించిన రూ.4లక్షల రివార్డ్‌ను అందజేశారు.