SRPT: హుజూర్ నగర్ క్యాంప్ కార్యాలయంలో మంత్రి ఉత్తమ్ లబ్ధిదారులకు సంక్షేమ పథకాల చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 437 మందికి రూ.1.80 కోట్ల విలువైన కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ఆయన పేర్కొన్నారు. అలాగే, అంగన్వాడీ టీచర్లు సాంకేతికతను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో 259 మందికి ఫోన్లు పంపిణీ చేశారు.