MNCL: రామకృష్ణాపూర్‌కు చెందిన యువ రచయిత్రి, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత సింధు కోలాకు ప్రతిష్ఠాత్మకమైన ‘యంగ్ ఛేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది. షీ ఇన్స్పైర్ మాగజైన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మాజీ కేంద్ర మంత్రి సంతోష్ బాగ్రోడియా, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ పుష్పలీల అవార్డు ప్రదానం చేశారు.