నల్గొండ: శాలిగౌరారం మండలం మాదారం కలాన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అర్వపల్లి నుండి నకిరేకల్ వైపు భైక్పై వస్తున్న ఊట్కూరి వీరయ్య డివైడర్ను ఢీకొట్టడంతో తలకు, చేతులకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం ఇవ్వగా అంబులెన్స్ సిబ్బంది వెంటనే చేరుకుని గాయపడిన వీరయ్యను నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.