HYD: దీపావళి.. ఇంటిల్లిపాదీ ఆనందంగా జరుపుకొనే పండగ. టపాసులు కాల్చడంలో పిల్లల నుంచి పెద్దల వరకు పోటీ పడుతుంటారు. ఏటా పండగ మరుసటి రోజు సరోజిని దేవి నేత్ర వైద్యశాల, ఎల్వీప్రసాద్ కంటి ఆసుపత్రి అత్యవసర విభాగాలకు కంటి గాయాలతో బాధితులు వస్తుంటారు. కంటి ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలని సరోజిని దేవి ప్రభుత్వ నేత్ర వైద్యశాల ఆఫ్తమాలజీ విభాగాధిపతి సూచించారు.