MBNR: అన్యాయం జరిగిన ప్రతిచోటా బాధితులు నిలదీసేలా డా. బీ.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగంలో అద్భుత అవకాశాలు కల్పించారని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ ఓబదుల్లా కొత్వాల్ అన్నారు. జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ పరిరక్షణతోనే దేశం సురక్షితమని, అణగారిన వర్గాల హక్కుల కోసం రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించాలన్నారు.