PDPL: DCC అధికార ప్రతినిధిగా రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన పెండ్యాల మహేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఇవాళ NTPCలో సీనియర్ న్యాయవాదులు పులిపాక ప్రవీణ్, సతీష్ రెడ్డి, NSUI రాష్ట్ర కార్యదర్శి బైరమల్ల ప్రసాద్, తదితరులు మహేష్‌ను శాలువా, పూలమాలతో సన్మానించారు. ఈ నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే M.S రాజ్ ఠాకూర్, మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.