MBNR: దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి బీజేపీ అభ్యర్థిగా రోజా రమేష్ సర్పంచ్ ఎన్నికల బరిలో దిగారు. తనను గెలిపిస్తే 20 హామీలు నెరవేరుస్తానని బాండ్ పేపర్ రాసి తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. వీటిలో ప్రధానంగా శివాజీ విగ్రహం ఏర్పాటు, రోడ్లు, వీధిదీపాలు, గ్రంథాలయం, ఆదాయ వ్యయాలను గ్రామసభలో చూపిస్తానన్నారు. 3 ఏళ్లల్లో 70% హామీలను నెరవేరుస్తామని పేర్కొన్నారు.