SRPT: ప్రజావాణి ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి 99 వినతులు స్వీకరించారు. ఇందులో 48 భూ సమస్యలే ఉన్నాయని తెలిపారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.