GDWL: భూభారతి క్రింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం అలంపూర్ మండలం ఉట్కూర్‌లో భూభారతి కింద పాస్ బుక్ కోసం దరఖాస్తు చేసుకున్న రైతుల పొలాలను స్వయంగా పరిశీలించారు. పూర్వ రికార్డ్స్, సర్వే డాక్యుమెంట్లు, ఫీల్డ్ సర్వే ఆధారంగా పరిష్కరించాలన్నారు.