HYD: నెక్లెస్ రోడ్‌లోని జలవిహార్‌లో శుక్రవారం కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డ్ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని నిరుద్యోగ JAC విద్యార్థులు కయ్య వెంకటేశ్, బాలకోటి సింధు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణలో ఉన్న ప్రతి నిరుద్యోగి పాల్గొనాలన్నారు.