BDK: భద్రాద్రి క్షేత్రంలో రామయ్య నిత్య కళ్యాణం వేడుక సోమవారం కనులవిందుగా సాగింది. తెల్లవారుజామున గర్భాలయంలో స్వామివారికి సుప్రభాత సేవ ఆరాధన తదితర పూజలు నిర్వహించారు. మేళతాళాల నడుమ ఉత్సవ మూర్తులను బేడా మండపానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. అక్కడ విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం అనంతరం శాస్త్రోక్తంగా కంకణధారణ యజ్ఞోపవీత ధారణ గావించి నిత్య కళ్యాణం జరిపించారు.
Tags :