NGKL: లింగాల మండలం అప్పాపురికి చెందిన తోకల పెద్ద మల్లయ్య అటవీ ప్రాంతంలో అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. నాలుగు రోజులుగా అధికారులు, కుటుంబ సభ్యులు అడవిలో వెతికినా ఆచూకీ దొరకడం లేదు. అటవీశాఖ అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని శనివారం కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.