ASF: ఈనెల 11న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్, కెరమెరి, లింగాపూర్, సిర్పూర్ (యు), వాంకిడి మండలాల్లో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ వరకు వైన్ షాపులు మూసివేయనున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి జ్యోతి కిరణ్ తెలిపారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు.