VKB: బంట్వారం మండల కేంద్రంలో డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు అంబేద్కర్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను అనుసరించాలని కమిటీ అధ్యక్షుడు దొరేటి సుధాకర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, నాయకులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.