HYD: హైదరాబాద్ మహానగరంలోని అన్ని హోటళ్ల కిచెన్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేయాలని అధికారులకు CM రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు కచ్చితంగా అమలు అయ్యేలా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు. ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన ఆహారం అందేలా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.