ADB: రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని బోథ్ MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. ఆదివారం మంచిర్యాలలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని తెలిపారు.