NRML: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజయ్య, కలెక్టర్ అభిలాష అభినవ్ లు విద్యార్థులను, కళాకారులను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.