NZB: ఆర్మూర్ నియోజకవర్గంలో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని CM రేవంత్ రెడ్డికి ఆర్మూర్ MLA పైడి రాకేష్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. శుక్రవారం నిజామాబాద్ నగరానికి వచ్చిన CMను MLA మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్మూర్లో డబుల్ బెడ్ రూమ్స్ ఇళ్ల పంపిణీ, లింకు రోడ్లు, బ్రిడ్జి పనులు, బిల్లులు మంజూరు చేయాలని కోరారు.