SKLM: గ్రామపంచాయతీల ఆదాయం పెంపొందించుకొని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని మందస ఎంపీడీవో వెంకటరమణ, డీపీఆర్సీ ఆనందరావు సూచించారు. శుక్రవారం మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో సొంతఆదాయం వనరుల ద్వారా గ్రామపంచాయతీ ఆదాయం పెంపొందించుట అనే అంశంపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు 2రోజు శిక్షణా తరగతులు నిర్వహించారు. గ్రామ పంచాయతీల ఆదాయ మార్గాలు గూర్చి వివరించారు.