NDL: ఓర్వకల్లు మండలం, ఉయ్యాలవాడకు చెందిన టీడీపీ కార్యకర్త మురళీధర్ రెడ్డి శుక్రవారం గుండెపోటుతో మరణించారు. విషయం తెలిసిన ఎంపీ బైరెడి శబరి ఉయ్యాలవాడకు చేరుకొని తమ అభిమాని మురళీధర్ రెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇది బాధాకరమైన సంఘటనా అని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపి, సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, పాల్గొన్నారు.