NLG: నల్గొండ బార్ అసోసియేషన్ ఎన్నికల సందడి మొదలైంది. చిట్యాల పట్టణానికి చెందిన గుండాల నరేష్ గౌడ్ కోశాధికారి (ట్రెజరర్) పదవికి తన నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం నామినేషన్ల పర్వం కొనసాగుతుండగా, న్యాయవాదుల మద్దతు కూడగట్టే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. ఈ ఎన్నికలు ఈనెల 26న జరగనున్నాయి. పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు.