BDK: పాల్వంచ మండలం, జగన్నాధపురం ప్రారంభంలో పెద్దమ్మతల్లి గుడి సమీపంలో మార్బుల్ స్టోన్ లోడ్‌తో వెళ్తున్న ట్రాలీ లారీ ఆదివారం అదుపుతప్పి డివైడర్‌పైకి ఎక్కింది. సేఫ్టీ చర్యలు లేకపోవడం వల్ల ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.