MBNR: జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం భరోసా కేంద్రం వార్షికోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి DLSA ఛైర్ పర్సన్, జడ్జి ఇందిరా హాజరయ్యారు. మహిళలకు, బాలికలకు న్యాయం అందించడంలో భరోసా కేంద్రం విశేష కృషి చేస్తుందని ఆమె కొనియాడారు. బాధితులకు న్యాయ సహాయం, సైకలాజికల్ సపోర్ట్, రిహాబిలిటేషన్ వంటి సమగ్ర సహాయం అందించడం ప్రశంసనీయమని ఆమె అన్నారు.