NLG: రాష్ట్రంలో ఏర్పడిన కృత్రిమ పెట్రోల్ డీజిల్ కొరత వల్ల వ్యవసాయ రంగం కుదేలు కానున్నట్టు సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యుద్ధం పేరుతో డిజిల్, పెట్రోల్, గ్యాస్ కృత్రిమ కొరత ఏర్పరుస్తున్నారని దీనివల్ల గృహ అవసరాలే కాక వ్యవసాయ రంగంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని అన్నారు.