KNR: రామడుగు మండలం వెదిర రైతు వేదిక ప్రాంగణంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ- టీ సెర్ఫ్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. ప్రభుత్వం వరి ధాన్యం క్వింటాలుకు ఏ గ్రేడ్ రకం రూ. 2,389, సాధారణ రకం ధాన్యానికి రూ. 2,369 అందిస్తున్నారు.