HYD: హైదరాబాద్ సీపీ సజ్జనార్ వేసవి సెలవుల్లో విద్యార్థులు డిజిటల్ వ్యసనానికి దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, గ్యాడ్జెట్లుకు బదులు తమ సమయాన్ని పిల్లలకు ఇవ్వాలని పిలుపునిచ్చారు. పిల్లలతో గడిపే సమయం వారి అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ విషయంపై ఆయన సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు.